సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (09:24 IST)

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అప్పుడూ.. ఇప్పుడూ ఉంది : రాధా ప్రశాంతి

radha prashanthi
చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై సీనియర్ నేటి రాధిక ప్రశాంతి స్పందించారు. ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆమె మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. 
 
చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అప్పుడూ ఉంది.. ఇప్పుడూ ఉంది.. ఇక ముందు కూడా ఉంటుంది. అప్పట్లో ఎవరి తిప్పలు వారు పడేవారే తప్పా ఈ స్థాయిలో పబ్లిసిటీ చేసుకోలేదన్నారు. ఇపుడు ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ రోడ్డెక్కారన్నారు. పైగా, ఇండస్ట్రీలో ఎవరినీ ఎవరూ బలవంతం చేయరని, ఎవరి ఇష్టం వారిది అని అన్నారు. 
 
క్యాస్టింగ్ కౌచ్‌కు నో చెప్పడం వల్లే తనకు సినిమా అవకాశాలు రాకుండా పోయాయని చెప్పారు. ఓ సారి తనను ఒక చిత్రంలో రెండో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఆ తర్వాత మేనేజరుతో అడిగించారు. అందుకు నో చెప్పడంతో ఆ సినిమా నుంచి నన్ను తీసేశారు. ఆ తర్వాత ఎస్ చెప్పిన ఓ నటిని రెండో హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారని తెలిపారు.