సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (16:24 IST)

ఆ సీరియల్‌లో నటించిన విజయ్ దేవరకొండ..

Devarakonda, Ananya Pandey
హైదరాబాద్ ప్రాంతానికి చెందిన విజయ్ దేవరకొండ తన పాఠశాల విద్యాభ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో ఉన్న శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పూర్తి చేశారు. అక్కడ చదువుతున్న సమయంలోనే సత్య సాయిబాబా జీవిత చరిత్ర గురించి ఒక తెలుగు సీరియల్ నిర్మించడం జరిగింది. 
 
ఇక ఆ సీరియల్‌లో విజయ్ దేవరకొండ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని స్వయంగా విజయ్ దేవరకొండ సత్య సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సీరియల్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాను అని స్పష్టం చేశారు. అంతేకాదు అందుకు సంబంధించిన ఆయన చిన్ననాటి ఫోటో కూడా ప్రస్తుతం వైరల్‌గా మారుతుంది. 
 
ఇకపోతే లైగర్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు మరొకసారి పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో జనగణమన సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు. ఇక మరొకవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.