గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (16:08 IST)

లైగర్ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

Liger
Liger
టాలీవుడ్ రౌడీ విజయ్‌ దేవరకొండ లైగర్‌ సినిమా విడుదలైంది. హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లకు విషెస్ చెబుతూ.. లైగర్ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చాడు మెగాస్టార్‌ చిరంజీవి. నాకౌట్ పంచ్ గట్టిగా ఇవ్వండి అంటూ ట్వీట్‌ చేశారు. 
 
కాగా చిరు చేసిన ఈ ట్వీట్‌ను చూసి లైగర్‌ నిర్మాత, నటి ఛార్మీ ఎమోషనల్‌ అయింది. "ఉదయాన్నే ఈ ట్వీట్‌ చూసి నాకు ఆనందం పట్టలేకున్నాను సర్‌. వెంటనే మీరు లైగర్‌ టికెట్‌ బుక్‌ చేసుకోండి" అని ట్వీట్‌ చేసింది.
 
కాగా ఛార్మీ ట్వీట్‌పై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. 'ఏంటి చార్మీ గారు.. మీరేం అనుకుంటున్నారు.. గ్రాడ్ యువర్ టికెట్ అంటున్నారు.. ఎక్కడ చూసినా థియేటర్లు మొత్తం ఫుల్ అయి ఉన్నాయ్.. మీరే టికెట్లు పంపించండి' అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.