ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (16:47 IST)

అద్భుతమైన సమయాన్ని గ‌డిపిన మెగాస్టార్ చిరంజీవి

Chiru-sureka-grand daughters
Chiru-sureka-grand daughters
మెగాస్టార్ చిరంజీవి త‌న కుటుంబంతో ఊరికి దూరంగా త‌న కుటుంబ స‌భ్య‌లతో గ‌డిపారు. త‌న భార్య సురేఖ‌, కొడుకు రామ్‌చ‌ర‌ణ్‌, కోడ‌లు ఉపాస‌న‌తోపాటు కూతుళ్ళు శ్రీ‌జ‌, సుష్మిత‌, మ‌న‌వ‌డు, మ‌న‌వ‌రాళ్ళ‌తో వున్న ఫొటోను చిరంజీవి షేర్ చేశారు. ఇందులో వ‌రుణ్‌తేజ్ మీసాలు, గెడ్డెంతీసి ఫ్రెష్ లుక్‌తో క‌నిపిస్తున్నారు. సాయితేజ్‌, అల్లు వెంక‌ట్ కూడా ఇందులో క‌నిపించారు.
 
chiru family
chiru family
సోమ‌వారంనాడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు. ఆరోజు ఆయ‌న అభిమానుల‌తోపాటు కుటుంబ స‌భ్యులు కూడా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదేరోజు చిత్ర‌పురి కాల‌నీలో త‌న తండ్రి పేరున ఆసుప‌త్రి ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ఫొటోలు పెడుతూ, ఈ పుట్టినరోజున, నేను నగరం నుండి దూరంగా కుటుంబంతో కలిసి కొంత అద్భుతమైన సమయాన్ని గడిపాను.. అంటూ పోస్ట్ చేశారు. సురేఖ‌, చిరు వున్న ఫొటో ఓ కోట ద‌గ్గ‌ర దిగిన‌ట్లు క‌నిపిస్తుంది.