బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (09:05 IST)

ఎన్టీఆర్‌.ను అమిత్ షా క‌ల‌వ‌డానికి కార‌ణ‌మ‌దేనా!

Amit Shah, NTR
Amit Shah, NTR
నిన్న బి.జె.పి. జాతీయ నేత అమిత్ షా టాలీవుడ్ హీరో ఎన్‌.టి.ఆర్‌.ను క‌ల‌వ‌డం విశేషం సంత‌రించుకుంది. ఎన్‌.టి.ఆర్‌.ను అమిత్ షా క‌లిసిన ఫొటోల‌ను నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ట్వీట్ చేశారు.

ఆయ‌న‌తోపాటు ప‌లువురు రాష్ట్ర బిజెపి నాయ‌కులు క‌లిశారు. కానీ అమిత్ షా మాత్రం కేవ‌లం 15 నిముషాల‌పాటు ఎన్‌.టి.ఆర్‌.తో ఏకాంతంగా మాట్లాడారు. ఆ విష‌యాలు ఏమీ బ‌య‌ట‌కు రాలేదు. మీడియా ముందు కూడా ఏమీ మాట్లాడ‌లేదు. క‌లిసిన అనంతం అమిత్ షా ట్వీట్ చేస్తూ, అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది అని పేర్కొన్నారు. ఇక ఎన్‌.టి.ఆర్‌. న‌టించిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా ఆస్కార్ బ‌రిలోకి వెళ్ళ‌నుంది. మ‌రోవైపు అంత‌ర్జాతీయ ఫెస్టివ‌ల్‌కు వెళ్ళ‌బోతోంది. ఇందుకు కేంద్ర ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు కూడా కావాల్సి వుంటుంద‌ని సినీ విశ్లేష‌కులు తెలియ‌జేస్తున్నారు.
 
ఇక బిజెపి ప్ర‌భుత్వం టాలీవుడ్‌లో ప్ర‌జాబ‌లం వున్న సినీ హీరోల‌ను క‌ల‌వ‌డం ఆన‌వాయితీగా మారింది. బాహుబ‌లి టైంలో కృష్ణంరాజు స‌మ‌క్షంలో ప్ర‌ధాని మోడీని ప్ర‌భాస్ క‌లిశారు. ఆ త‌ర్వాత చిరంజీవిని ప్ర‌త్యేకంగా ఆహ్వానించి భీమ‌వ‌రంలో జ‌రిగిన అల్లూరి సీతారామారాజు శ‌త జ‌యంతి ఉత్స‌వాల్లో ఆప్యాయంగా మోదీ ప‌లుక‌రించారు. ఇంకోవైపు రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రంలో పాపుల‌ర్ హీరోల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూవుంది .ఇందుకు ఉదాహ‌ర‌ణే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌ను ఇప్పుడు రెండు రాష్ట్రంలోని సి.ఎం.ల‌ను ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. 
 
అయితే ఎన్‌.టి.ఆర్‌. ఇప్పుడ‌ప్పుడే రాజ‌కీయాల్లోకి రాన‌ని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. అప్ప‌ట్లో తెలుగుదేశం త‌ర‌పున చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌మోష‌న్ కూడా చేశాడు. కానీ అది పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ఆయ‌న స‌న్నిహితుడు కొడాలి నాని అప్ప‌ట్లో మ‌ద్ద‌తు తెలిపినా ఆ త‌ర్వాత పార్టీకి నాని దూర‌మ‌య్యాడు. ఎప్పటి నుంచో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అందుకే, బీజేపీ పెద్దలు ఎన్టీఆర్ పై గురి పెట్టారని టాక్ నడుస్తోంది. ఇంకా ఎల‌క్ష‌న్ల‌కు స‌మ‌యం వుంది క‌నుక త్వ‌ర‌లో ఏమి జ‌ర‌గ‌బోతోంది తెలియ‌నుంది.