సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (11:18 IST)

ఖుషీ టైటిల్‌పై రౌడీ హీరో స్పందన.. పవన్ ఫ్యాన్స్‌ను నిరాశపర్చను

kushi
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఖుషీ, జనగణమణ సినిమాలు సెట్స్‌మీద ఉన్నాయి. యాక్షన్ ఎంటర్ టైనెర్స్ మధ్యలో ఖుషీ అనే లవ్ స్టోరీతో రాబోతున్నాడు విజయ్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తోంది.

ఇక ఈ సినిమా టైటిల్‌పై పవన్ ఫ్యాన్స్ కొద్దిగా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఖుషీ అంటే పవన్ కెరీర్‌లో ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా టైటిల్‌పై విజయ్ మొట్టమొదటిసారి ఓపెన్ అయ్యాడు.

"ఖుషీ టైటిల్‌ను తీసుకోవడంతోనే నా బాధ్యత మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గర్వపడేలా ఈ సినిమా ఉంటోంది. పవన్ ఫ్యాన్స్‌ను నిరాశపర్చను. ఆయన సినిమాలో ఉన్న మ్యాజిక్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. ఖుషీ సినిమా ఆ జనరేషన్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో.. మా సినిమా ఈ జనరేషన్ లో కూడా అంతే మ్యాజిక్ సృష్టిస్తోంది" అంటూ చెప్పుకొచ్చాడు.