ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (19:11 IST)

లైగర్ కుమ్మేస్తుంది.. నేను గ్యారెంటీ.. ఆగస్టు 25న వాట్ లగా దేంగే: విజయ్ దేవరకొండ

Liger
Liger
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  ''లైగర్'' (సాలా క్రాస్‌ బ్రీడ్) ఆగస్టు 25న విడుదలౌతుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. 
 
పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్  ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. 
 
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్టు 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో గుంటూరులో 'లైగర్‌’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. భారీ సంఖ్యలో జనాలు హాజరైన ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది. 
 
ఈ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఎప్పటినుండో మీ దగ్గరికి రావాలని ఎదురుచూస్తున్నా. నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా లైగర్. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇంత అద్భుతమైన సినిమాని మీ దగ్గరికి తీసుకురావాలని ఎంతగానో ఎదురుచూశాను. అయితే సరైన సమయంలో లైఫ్ లో డ్రామా,..హెల్త్, బాడీ సపోర్ట్ చేయడం లేదు. ప్రమోషన్స్ లో రోజుకో సిటీలో ఉంటున్నాం. అయితే ఈ రోజు ఇక్కడ నిలుచుని మాట్లాడటానికి కారణం మీరు ఇస్తున్న ప్రేమ. 
 
ఇండియాలో ఎక్కడికి వెళ్ళిన అమితంగా ప్రేమించారు. ఆ ప్రేమని మర్చిపోలేను. అరవై ఏళ్ల తర్వాత కూడా గత ఇరవై రోజుల్లో జరిగిన ఈవెంట్స్ అందమైన జ్ఞాపకాలుగా గుర్తిండిపోతాయి. అంత బలమైన జ్ఞాపకాలు నాకిచ్చారు. ఇప్పుడు నేను మీకు మంచి జ్ఞాపకం ఇవ్వాలి. మీరు గుర్తుపెట్టుకునే సినిమా ఇస్తే నా పర్పస్ నేరవేరినట్లు. అందులో ఒక అడుగు లైగర్ అని బలంగా నమ్ముతున్నా. 
 
పూరి, ఛార్మి గారు ఈ కథ చెప్పినపుడు నా మనసులో వచ్చిన మాట మెంటల్. ఈ సినిమాని ప్రేక్షకులకు త్వరగా చూపించేయాలనే ఎక్సయిట్‌మెంట్. కానీ మూడేళ్ళు పట్టింది. ఇప్పుడు కేవలం ఐదు రోజులే మిగిలింది. నేను గ్యారెంటీ ఇస్తున్నా. లైగర్ కుమ్మేస్తుంది. మీరు నాకోసం ఒకటి చేయాలి. ఆగస్టు 25 గుంటూరుని షేక్ చేయాలి. ఈ వేదిక నుండి ఇండియాకి ఒక సందేశం ఇవ్వాలని అనుకుంటున్నా. ఆగస్టు 25 వాట్ లగా దేంగే'' అన్నారు.
 
పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. హలో గుంటూరు.. మిమ్మల్ని అందరిని చూస్తుంటే సినిమా ప్రమోషన్స్ కి వచ్చామా ? సక్సెస్ టూర్ కి వచ్చామో అర్ధం కావడం లేదు. మీ అందరు ఒక్కో టికెట్ కొనండి మా సినిమా బ్లాక్ బస్టర్. విజయ్ లైగర్ లో ఇరగదీశాడు. అనన్య చింపేసింది. రమ్యకృష్ణ ఉతికి ఆరేసింది. మైక్ టైసన్ లైగర్‌లో నటించారు. ఆయన్ని కొట్టే మొనగాడు ఎవడూ లేడు. ఆలాంటి మనిషి మా సినిమాలో నటించారు. మైక్ టైసన్ గ్రేట్ మ్యాన్. ఆయన గొప్పదనం గురించి గూగుల్ చేయండి. ఆయన ప్రజన్స్ ఇంకా ఎంజాయ్ చేస్తారు. లైగర్ ని ప్రేమతో చేశాం.  లైగర్ ఇంకా రిలీజ్ కాలేదు, ఎంత కలెక్ట్ చేస్తోందో తెలీదు. ఇదంతా పక్కన పెట్టి లైగర్ కంటే డబుల్ బడ్జెట్ తో విజయ్ తో జనగణమన తీస్తున్నాం. ఒక షెడ్యుల్ పూర్తయింది. ఇదీ మా నమ్మకం. ఆగస్టు 25న లైగర్ వస్తోంది. అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి'' అన్నారు.
 
అనన్య పాండే మాట్లాడుతూ... నా పేరు అనన్య పాండే. తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చే ముందుకు పూరిగారు నాకో మాట చెప్పారు. గుంటూరు బోల్ కే ఎక్ సెహర్ హే.. యహ మారోతో ఇండియా రీ సౌండ్ హోతా. లైగర్ తో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. విజయ్ దేవరకొండ, పూరి గారు, విష్ , ఛార్మి గారు ఇలా మంచి టీంతో కలసి పని చేయడం ఆనందంగా వుంది. లైగర్ పెద్ద సక్సెస్ అవుతుంది. మళ్ళీ గుంటూరు వస్తాం. కుమ్మేసుకుందాం' అన్నారు
 
ఛార్మి మాట్లాడుతూ.. రెండే మాటలు చెప్తా. ఒకటి.. ఆగస్టు 25న లైగర్ వాట్ లగా దేంగే. రెండు.. జై బాలయ్య జైజై బాలయ్య. లవ్ యు ఆల్. విష్ మాట్లాడుతూ.. నాకు ఇండియన్ ఆర్మీ అంటే చాలా ఇష్టం. నేను యాక్టర్ కాకపోయివుంటే ఆర్మీలో ఉండేవాడిని. అయితే సినిమా పరిశ్రమలో కూడా బోర్డర్ లో ఒక సైనికుడు ఎంత అలర్ట్ గా ఉంటాడో అంత అలర్ట్ గా వుంటేనే అవకాశాలు వస్తాయి. 
 
విజయ్ దేవరకొండ లైగర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం అంత తేలికగా జరగలేదు. లవర్ బాయ్ నుండి యాక్షన్ హీరో కావడం మజాక్ కాదు. చాలా నిద్రలేని రాత్రులు గడపాలి. చాలా కష్టపడాలి. ఇప్పుడా హార్డ్ వర్క్ కారణంగానే విజయ్ లైగర్‌తో ఇండియాని షేక్ చేస్తున్నారు. విజయ్‌తో పని చేయడం గౌరవంగా భావిస్తున్నా. పూరి సర్ అంటే ఎవరెస్ట్ అంత గౌరవం నాకు. అనన్యకి ఒక టాప్ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ వున్నాయి. నెక్స్ట్ తనే షేక్ చేస్తోంది. ఛార్మి గారు  సినిమా కోసం ప్రతి క్షణం కష్టపడతారు. హ్యాట్సప్ ఛార్మి గారు. చాలా దూరం నుండి ఈ వేడుకకి వచ్చిన అందరికీ థాంక్స్. లైగర్ థియేటర్లో చూడాల్సిన సినిమా. ఆగస్టు 25న వాట్ లగా దేంగే.