గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (13:16 IST)

మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్న సమంత... ఎందుకో తెలుసా?

Samantha Akkineni
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మార్షల్ ఆర్ట్స్‌ శిక్షణ తీసుకుంటోంది. చైతూతో విడాకుల తర్వాత బిజీగా మారిన సమంత.. తాజాగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటోంది. మాజీ భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న ఈమె సమంత సంచలన కథానాయికగా కనిపిస్తోంది. పుష్పలో ఐటమ్ సాంగ్‌తో ఇరగదీసింది.

తమిళంలో కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమా చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఖుషి, యశోద, శకుంతలం సినిమాలున్నాయి. బాలీవుడ్ అవకాశాన్ని కూడా సమంత కైవసం చేసుకుంది. ప్రస్తుతం సమంత ప్రముఖ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్-డీకే సహ దర్శకత్వం వహించే కొత్త వెబ్ సిరీస్‌లో నటించబోతోంది.

ఈ సీరియల్‌లో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సిరీస్ సిటాడెల్ సిరీస్‌కి రీమేక్ అని అంటున్నారు. యాక్షన్‌తో కూడిన ఈ సీక్వెల్ కోసం సమంత, వరుణ్ ధావన్ ఇద్దరూ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్నారు. ఈ ట్రైనింగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.