శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (13:10 IST)

సమంత ఎదురుపడితే హాయ్ చెప్పి హగ్ చేసుకుంటా : నాగ చైతన్య

samantha-naga chaitanya
తెలుగు హీరో అక్కినేని నాగచైతన్యకు ఓ సంకటస్థితి ఎదురైంది. ఆయన్ను విలేకరులు అడిగిన ప్రశ్నకు ఏమాత్రం ఆలోచన చేయకుండా సమాధానమిచ్చారు. పైగా, ఆ ఆన్సర్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య చకితులను చేసింది. సమంత ఎదురుపడితే ఏం చేస్తారు అని అభిమానులు ప్రశ్నిస్తే... హాయ్ చెప్పి హగ్ చేసుకుంటా అని ఠక్కున ఆన్సర్ ఇచ్చారు.
 
తాజాగా ఆయన ఓ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సమంతను కలుసుకుంటే ఏం చేస్తారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి నాగచైతన్య స్పందిస్తూ, హాయ్ చెప్పి.. హగ్ చేసుకుంటా అని చెప్పారు. ఎంతో కాలంగా ప్రేమించుకుని 2017లో అక్టోబరు నెలలో నాగ చైతన్య సమంత వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సరిగ్గా నాలుగేళ్ళకు 2021 అక్టోబరు నెలలో విడాకులు తీసుకున్నారు.
 
నాగచైతన్య తన చేతిలో వివాహ తేదీని కోడ్ రూపంలో పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. దీన్ని తొలగించుకునే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పాడు. "నేను కొందరు అభిమానులను కలుసుకున్నారు. ఆ సందర్భంగా వారి చేతిపై నామిదిరే టాటూ వేయించుకోవడం చూశాను. అది నా వివాహ తేదీ. కనుక దీన్ని అభిమానులు అనుసరించాలని తాను కోరుకోవడం లేదన్నారు.