బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (18:38 IST)

తారక్‌తో నటించే ఛాన్స్ వస్తే అంతకన్నా అదృష్టం ఏముంది?

jhanvi kapoor
అతిలోక సుందరి, శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేసింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో క్లారిటీ రానప్పటికీ, జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. 

 
ఈ ప్రచారంపై జాన్వీ కపూర్ స్పందిస్తూ... తనకు తెలుగులో లేదా ఏదైనా సౌత్ సినిమాలో చేయాలనే కోరిక ఉందని చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చిందనే రూమర్ నిజమైతే తనంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరని... అయితే దురదృష్టవశాత్తు తనకు అలాంటి ఆఫర్ రాలేదని తెలిపింది. 

 
జూనియర్ ఎన్టీఆర్‌తో నటించే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదని చెప్పింది. తారక్‌తో అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది.