గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 డిశెంబరు 2025 (17:32 IST)

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

Bus accident
Bus accident
తమిళనాడు దిండుక్కల్‌‍లో ఘోరం జరిగింది. బస్సు నుంచి కిందపడిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

తమిళనాడు కోవిల్‌పట్టికి తర్వాత విఎస్ కోట్టై ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల అమరావతి.. తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి ఓ ప్రైవేట్ బస్సులో వస్తుండగా.. కనవాయ్ పట్టి సమీపంలో కండెక్టర్ ఇచ్చిన టికెట్‌ను చేతిలోకి తీసుకునే క్రమంలో మహిళ కిందపడి ప్రాణాలు కోల్పోయింది. 
 
బస్సు మెట్లకు దగ్గర నిల్చుండటంతో పాటు కండక్టర్ ఇచ్చిన టిక్కెట్టును తీసుకునే క్రమంలో కమ్మీని పట్టుకోకపోవడం వల్లే ఆ మహిళ అదుపుతప్పి బస్సు నుంచి బయట పడింది. దీంతో తీవ్రగాయాల పాలైన మహిళ ప్రాణాలు కోల్పోయింది.