శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జులై 2022 (13:03 IST)

చెల్లి గురించి చెడుగా మాట్లాడితే తాట తీస్తా.. జాన్వీ కపూర్

jhanvi kapoor
బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా వున్న అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ చెల్లి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
 
శ్రీదేవి బోనీ కపూర్ రెండవ కూతురు ఖుషి కపూర్ గురించి మనకు తెలిసిందే. ఈమె కూడా తన తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఖుషి కపూర్ ప్రస్తుతం జోయా అఖ్తర్ తెరకెక్కిస్తున్న ది ఆర్చీస్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమాలో తన చెల్లి హార్డ్ వర్క్ డెడికేషన్ చూసి హ్యాపీగా వుందన్నారు.
 
ఇకపోతే తన చెల్లెలు గురించి ఎవరైనా ఏ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్లు చేసిన, తన చెల్లి గురించి చెడుగా మాట్లాడిన వారి తాట తీస్తానని ఈమె గట్టి వార్నింగ్ ఇచ్చారు. 
 
ఈ విధంగా చెల్లెలు గురించి జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈమె సినిమాల విషయానికి వస్తే దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, హెలెన్, మిస్టర్ అండ్ మిసెస్ మహీ వంటి సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.