ప్రియుడికి బ్రేకప్ చెప్పిన శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి
బాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్, శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి ప్రియుడికి గుడ్‌బై చెప్పింది. షమితా శెట్టి బ్రేకప్ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 43 ఏళ్ల వయసులో మరోసారి బ్రేకప్ కావడం బాలీవుడ్ వర్గాల్లోను ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.
బిగ్‌బాస్ ఓటీటీ షోలో వారి ప్రేమాయణం మొదలైంది. ఈ షోలో రాకేష్ బాపట్, షమితా శెట్టి మధ్య బాండింగ్ ఏర్పడింది. అయితే బిగ్‌బాస్ ఓటీటీ షోలో రాకేష్, షమితా శెట్టి, సింగర్ నేహా భాసిన్ మధ్య ట్రాయంగిల్ లవ్ స్టోరి జరిగింది. నేహాతో తన ప్రేమ విషయాన్ని షమితా పంచుకోవడం ఓ ట్విస్టుగా మారింది.
బిగ్‌బాస్ ఓటీటీ షో రంజుగా, వివాదాల మధ్య కొనసాగుతుండగా.. షమితా శెట్టికి రాకేష్ తన లవ్ ప్రపోజల్‌ను తెలిపాడు. బిగ్‌బాస్ షో సాక్షిగా ప్రేమ చిగురించింది. బిగ్‌బాస్ ఓటీటీ తర్వాత లవ్ అఫైర్ జోరుగా కొనసాగుతుండగానే.. షమితా బిగ్‌బాస్ సీజన్ 15లోకి అడుగుపెట్టింది.
షమితాకు బయట నుంచి రాకేష్ మద్దతు తెలుపుతున్న సమయంలో.. ఆయనకు కూడా షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ లభించింది. అయితే షోలో ఉండగా కిడ్నీ పెయిన్ కారణంగా రాకేష్ ఎక్కువ రోజులు ఉండకుండానే బయటకు వచ్చాడు.
అయితే 2022లో షమితా, రాకేష్ బాపట్ విడిపోయారనే రూమర్లు వైరల్ అయ్యాయి. అయితే వాటిని షమితా ఖండించింది. అయితే తాజాగా రాకేష్ బాపట్ తాను విడిపోయాం అని స్పష్టం చేసింది.