బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 27 జులై 2022 (18:56 IST)

లైగ‌ర్ నుంచి కొత్త అప్‌డేట్ రాబోతోంది

Vijay Deverakonda, Ramyakrishna
Vijay Deverakonda, Ramyakrishna
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ పాన్ ఇండియా మూవీ 'లైగర్' ''(సాలా క్రాస్‌బ్రీడ్) ట్రైలర్‌కు కనీవిని ఎరుగని రీతిలో రెస్సాన్స్ వ‌చ్చింది. అన్ని ప్రాంతాల‌ను ప‌ర్య‌టించి ట్రైల‌ర్ గురించి సినిమా గురించి చిత్ర యూనిట్ మాట్లాడింది. ఆ ట్రైల‌ర్‌లో విజయ్ దేవరకొండకు త‌ల్లిగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ `అరె` అనే డైలాగ్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. త‌న కొడుకును అత్యున్న‌త స్థాయిలో చూడాల‌న్న ఆమె కోరిక ఇందులో క‌నిపిస్తుంది.
 
ఇప్పుడు తాజాగా ఓ స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. స‌ముద్ర‌పు ఒడ్డున కూర్చుని త‌దేగంగా చూస్తున్న ఆ స్టిల్‌ను చూపిస్తూ ఈనెల 29న స‌రికొత్త అప్‌డేట్‌తో రాబోతున్నామంటూ పేర్కొన్నారు. మ‌రి ఆ అప్‌డేట్ ఏమిటో అనేది ఆస‌క్తిగా మారింది.  అనన్య పాండే నాయిక‌గా న‌టించింది. పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అనిల్ తడాని ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు. మైక్ టైస‌న్ ఇందులో న‌టించ‌డం విశేషం.