ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (18:52 IST)

ద‌ర్శ‌కులంద‌రినీ క‌లిపిన తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌

Directors team
Directors team
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కులంద‌రినీ ఒక్కో శైలి. ఎవ‌రికివారు షూటింగ్‌లో వుంటే బిజీగా వుంటారు. ఏవో పార్టీలు, ఫంక్ష‌న్ల‌కు క‌లిసి పాల్గొంటారు. అలాంటివారిని సినీమారంగంలోని కాస్ట్ ఆఫ్ ప్రొడ‌క్ష‌న్ అనే స‌మ‌స్య క‌లిపింది. గ‌త కొద్దిరోజులుగా నిర్మాత దిల్‌రాజు సినిమారంగంలోని ఒక్కో శాఖ‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను పిలిపించుకుని స‌మావేశం జ‌రిపి ఫైన‌ల్ నిర్ణ‌యాన్ని తీసుకుంటున్నారు. ఆ క్ర‌మంలో ఈరోజు తెలుగు ద‌ర్శ‌కులంతా ఫిలింఛాంబ‌ర్‌లో క‌ల‌వ‌డం జ‌రిగింది.
 
వీరిలో అనిల్‌రావిపూడి, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, మెహ‌ర్ ర‌మేష్‌, బుజ్జిబాబు, సుధీర్ వ‌ర్మ‌, ప‌ర‌శురామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. రాజ‌మౌళి ఇందులో క‌నిపించ‌లేదు. ఈరోజు జ‌రిగిన భేటీలో ద‌ర్శ‌ఖుల పారితోషికం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. కోట్ల రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్‌, ఏరియా వైజ్ లాభాల్లో ద‌ర్శ‌కుడు షేర్ కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని నిర్మాత‌ల మండ‌లి దిల్‌రాజును కోరిన‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లో వీటి వివ‌రాలు తెలియ‌నున్నాయి.