పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం పొందిన లైగర్ టీమ్
Vijay Devarakonda, Puri Jagannath, Charmi
విజయ్ దేవరకొండ తన లైగర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదలకుముందు దేశంలో ప్రధాన దేవాలయాలను సందర్శించారు. తిరిగి ఇంటికి వచ్చాక తన స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకున్నారు. అయితే సినిమా విడుదల తర్వాత డివైడ్ టాక్ రావడంతోపాటు దర్శకుడు పూరీ జగన్నాథ్ సరిగ్గా తీయలేదనే విమర్శలు వచ్చాయి.
ఇదిలా వుండగా, శుక్రవారంనాడు లైగర్ టీమ్ హైదరాబాద్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి దైవానుగ్రహాన్ని కోరింది. చార్మి, విజయ్ దేవరకొండతోపాటు పలువురు నటీనటులు ఇందులో పాల్గొన్నారు. ఒక సంపూర్ణ మాస్ ఎంటర్‌టైనర్ అని ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇక ఇదే రోజు విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా కోసం కసరత్తు చేస్తున్న జిమ్ వీడియోను కూడా పోస్ట్ చేశారు.