బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (11:26 IST)

శత్రువులు వున్నారు.. వాళ్ల మాట వినకపోతే ఏమైనా చేస్తారు.. నిత్యామీనన్

nithya menon
కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా నిత్యామీనన్ నటించిన తిరుచిట్రంబలం చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఒక భేటీలో నటి నిత్యామీనన్‌ పలు విషయాల గురించి మనసు మాట్లాడింది. 
 
అందులో ముఖ్యంగా తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ తనకు చాలా మంది శత్రువులు ఉన్నారని చెప్పింది. మనం ఎదుగుతున్నప్పుడు గిట్టని వాళ్లు చాలా మంది కాళ్లు పట్టుకుని కిందకు లాగాలని భావిస్తారని వెల్లడించింది. వాళ్ల మాట వినకపోతే వదంతులు ప్రచారం చేయడానికీ వెనుకాడరని తెలపింది. 
 
నిత్యామీనన్‌తో పని చేయడం చాలా కష్టం అంటారని, అయితే తాను చాలా మందితో కలిసి పని చేశానని, ఎవరూ అలా భావించలేదని నిత్యామీనన్ వెల్లడించింది. కారణం తాను ఎలాంటి వ్యక్తినో వారందరికీ తెలుసని స్పష్టం చేసింది. 
 
కాగా, మలయాళ చిత్ర పరిశ్రమ ఒక దశలో నిత్యామీనన్‌పై రెడ్‌ కార్డు విధించాలనే వరకూ వచ్చింది. ఒక మలయాళ చిత్ర షూటింగ్‌లో ఉన్న నిత్యామీనన్‌ను కలవడానికి ఒక నిర్మాత రాగా ఆయన్ని కలవడానికి నిరాకరించిందనే ఘటన అప్పట్లో కలకలం రేకెత్తించింది.