శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (12:09 IST)

మళ్లీ షూటింగులో గాయపడిన కోలీవుడ్ నటుడు విశాల్

vishal
తమిళ హీరో నటుడు విశాల్‌కు గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. తన తదుపరి సినిమా 'మార్క్‌ ఆంటోనీ' చిత్రీకరణలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సినిమాలోని కీలక ఫైట్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రథమ చికిత్స అనంతరం విశాల్‌ షూట్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నారు.
 
విశాల్‌కు గాయాలు కావడంతో ‘మార్క్‌ ఆంటోనీ’ షూట్‌‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ వార్తలు బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక, సినిమాల కోసం విశాల్ ఎలాంటి రిస్క్‌లనైనా తీసుకోవడానికి ముందుంటారు. గతంలోనూ ఆయన పలు సినిమాల షూటింగుల్లో గాయాలపాలయ్యారు. ఇటీవల ‘లాఠీ’ షూట్‌లోనూ ఆయనకు పలుమార్లు గాయాలయ్యాయి.