శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఆగస్టు 2022 (12:16 IST)

కాబూల్‌లో బాంబు పేలుళ్లు - 8 మంది మృత్యువాత

bomb blast
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ మరోమారు బాంబుల మోతతో దద్ధరిల్లిపోయింది. కాబూల్‌లోని అత్యంత రద్దీగా ఉండ షాపింగ్ వీధిలో శక్తిమంతమైన బాంబు పేలింది. దీంతో ఎనిమిది మంది మరణించగా మరో 22 మంది గాయపడ్డారు. ఈ క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
కాగా, దేశంలో మైనార్టీలైన షియా ముస్లిం వర్గానికి చెందిన ప్రజలు కలుసుకునే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పైగా, ఈ బాంబు దాడికి తాము నైతిక బాధ్యత వహిస్తున్నట్టు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు చెందిన సున్ని ముస్లిం గ్రూపు అధికారిక ప్రకటన చేసింది. 
 
ఈ పేలుళ్ళలో ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, శుక్రవారం కాబూల్‌లో జరిగిన బాంబు దాడిలో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మరో 18 మంది గాయపడ్డారు.