శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (10:25 IST)

నంబర్ వన్ స్థానాన్ని ప్రేక్షకులే ఇవ్వాలి : అదితి శంకర్

adithi shankar
తమిళ చిత్రసీమలో హీరోయిన్ అగ్రస్థానం ఖాళీగా ఉందని, ఆ స్థానాన్ని ప్రేక్షక దేవుళ్లు కట్టబెట్టాలని హీరోయిన్‌గా పరిచయమవుతున్న సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ అన్నారు. ఆమె నటించిన తొలి చిత్రం "విరుమన్". కార్తీ హీరో. ఈ నెల 12వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, చెన్నైలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 
 
శంకర్ కుమార్తే అనే ట్యాగ్‌లైన్ సినిమాల్లో ఎంట్రీవరకే పరిమితమవుతుందన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే తన వ్యక్తిగత ప్రతిభతో రాణించాల్సివుంటుందన్నారు. ఆ మేరకు తన సత్తాను నిరూపించుకుంటాన్న విశ్వాసం తనకు ఉందన్నారు. 
 
ఇకపోతే, తమిళంలో హీరోయిన్ నంబవర్ స్థానాన్ని నయనతార ఆక్రమించుకునివున్నారు. ఇపుడు ఎవరూ లేరు. ఆ స్థానాన్ని మీరు భర్తీ చేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె ఆమె సమాధానమిచ్చారు. ఆ స్థానాన్ని ప్రేక్షకులతో పాటు మీడియా ఇవ్వాల్సివుందన్నారు. 
 
కార్తీతో కలిసి నటించానని, శివకార్తికేయన్‌తో కలిసి నటించనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత విజయ్, అజిత్, సూర్య వంటి చిత్రాల్లో నటించాలన్న ఆశ ఉందని చెప్పారు. నాకు నచ్చిన నడుడు తలైవర్ రజనీకాంత్ కాగా, నాకు నచ్చిన చిత్రం "అన్నియన్" అని చెప్పారు.