శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 జులై 2022 (11:12 IST)

రష్మిక మందన్న ఇల్లు అడవిగా మారబోతుందట! (video)

Rashmika Mandanna
రష్మిక మందన్న ప్రస్తుతం సినిమాలతో బిజీగా వుంది. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అంటూ తిరిగేస్తుంది. బాలీవుడ్‌లో ఆల్రెడీ రెండు మూడు ప్రాజెక్ట్‌లను సెట్ చేసింది. 
 
కోలీవుడ్, టాలీవుడ్‌ ప్రేక్షకులను విజయ్ వారసుడు చిత్రంతో ఒకే సారి పలకరించనుంది. ఇక పుష్ప 2 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటోంది. 
 
రష్మిక ఇన్ స్టా స్టోరీల ద్వారా తన ఫాలోవర్లను ఎంటర్టైన్ చేస్తుంటుంది. ఫన్నీ క్విజ్ క్వశ్చన్స్ అడుగుతుంది.. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెడుతుంటుంది.. అలా నిత్యం తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది రష్మిక మందన. ఇక ఈ మధ్య రష్మిక ఇంట్లోకి ఓ కొత్త జీవి వచ్చేసింది.
 
రష్మిక ఇంట్లో ఇప్పటికే ఓ పెట్ ఉంది. ఆరా అంటూ తన పెట్ గురించి నిత్యం ఏదో ఒక పోస్ట్ వేస్తూనే ఉంటుంది రష్మిక. తాజాగా పిల్లిని కూడా రష్మిక పెంచుకునేందుకు రెడీ అయింది. దాని పేరు స్నో అంటూ అందరికీ పరిచయం చేసింది. 
 
ఇక రానున్న మూడేళ్లలో తన ఇళ్లు ఓ అడవిలా మారుతుంది అని రష్మిక పోస్ట్ వేసింది. మొత్తానికి ఈ స్నో, ఆ ఆరా, రష్మిక అల్లరిని చూస్తూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు.