మంగళవారం, 29 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జులై 2025 (19:48 IST)

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

snake
snake
బీహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ బుడ్డోడు పామును కొరికి చంపేశాడు. పాము అనేది తెలియక ఆట వస్తువుగా భావించిన ఆ బుడ్డోడు దానికి కొరికి చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బెట్టాహ జిల్లాలోని వెస్ట్‌ చాంపరన్‌లో ఓ ఇంట్లో ఓ బుడ్డోడు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగి నాగుపాము వచ్చింది. 
 
దాన్ని చూసి బాలుడు భయపడలేదు. ఆట వస్తువుగా భావించి దాన్ని పట్టుకున్నాడు. నోట్లో పెట్టుకొని కోరికి పారేశాడు. దీంతో ఆ పాము అక్కడిక్కడే చనిపోయింది. ఆ తర్వాత బాలుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ ఆ బాలుడిని పరిశీలించిన వైద్యులు పాము విషం పిల్లాడికి ఎక్కలేదని నిర్ధారించారు.  దీంతో అతడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.