మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 జులై 2022 (10:07 IST)

అభిమానుల కోస‌మే ఇరవై ఏళ్ల ఎనర్జీతో చేశా - నితిన్‌

Nithin, Kriti Shetty, Catherine Theresa, Anjali  and others
Nithin, Kriti Shetty, Catherine Theresa, Anjali and others
అభిమానులు ఎప్పుడూ డ్యాన్స్ సాంగ్స్ చేయమని అడుగుతుంటారు. వారి కోసమే ఈ చిత్రంలో హెవీ డ్యాన్స్ నెంబర్స్ పెట్టాం- అని నితిన్ అన్నారు. నితిన్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' లోని స్పెషల్ సాంగ్ భారీ హైప్ క్రియేట్ చేసింది. మొదట ఈ పాటలోని అంజలి లుక్‌ని విడుదల చేశారు. తర్వాత అదిరిపోయే ప్రోమోని విడుదల చేశారు.  స్టార్ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హైదరాబద్ లో గ్రాండ్ గా జరిగిన మాస్ మ్యూజిక్ జాతర ఈవెంట్ లో మాస్ డ్యాన్స్ నంబర్ ''రా రా రెడ్డి'' లిరికల్ వీడియోను విడుదల చేశారు. 

ఈ సంద‌ర్భంగా నితిన్ మాట్లాడుతూ.. లిరికల్ వీడియోలో వున్నది సాంపిల్ మాత్రమే ఈ సినిమాలో పాట అదిరిపోతుంది. జానీ మాస్టర్‌తో చేసిన ప్రతి పాట సూపర్ హిట్, ఈ పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. సాగర్ అద్భుతమైన ట్యూన్ చేశారు. కాసర్ల శ్యామ్ చాలా మాస్ గా రాశారు. దర్శకుడు రాజ శేఖర్ రెడ్డి సినిమా అద్భుతంగా తీశారు. దిల్ రాజు గారు ఈ పాటని రిలీజ్ చేయడం ఆనందం. ఈ పాటలో జయంలో రానురాను పాట రిపీట్ చేయడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ పాటని షూట్ చేస్తున్నపుడు ఇరవై ఏళ్ల క్రితం ఎంత ఎనర్జీ వుండిదో అదే ఎనర్జీ తో ఈ పాటని చేశాను. నన్ను లాంచ్ చేసిన తేజ గారికి, ఆ పాటని ఇచ్చిన ఆర్పీ పట్నాయక్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అంజలి అద్భుతమైన నటి. ఈ పాట చేస్తున్నపుడు ఆమెకు మోకాలికి గాయం వున్నప్పటికీ ఫ్లోర్ మూమెంట్స్ అన్నీ చాలా హార్డ్ వర్క్ చేసిన అద్భుతమైన డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కృతితో నా మొదటి సినిమా. ఈ సాంగ్ లో కూడా కృతి సర్ ప్రైజ్ వుంటుంది. ఆగస్ట్ 12 న సినిమా వస్తుంది.దానికి ముందు మరిన్ని ఈవెంట్స్ తో కలుద్దాం'' అని చెప్పారు.
 
అంజలి మాట్లాడుతూ.. రారా రెడ్డి నాకు స్పెషల్ సాంగ్. నితిన్ గ్రేట్ డ్యాన్సర్. పక్కన డ్యాన్స్ చేయడం అంత తేలిక కాదు. పాట చివర్లో రానురాను అనే పల్లవి రావడం ఇంకా జోష్ ని నింపింది అన్నారు.
 
కృతిశెట్టి మాట్లాడుతూ.. నితిన్ గారు ఎక్స్ ప్రెసీవ్ డ్యాన్సర్. ఆయన డ్యాన్స్ చేసినప్పుడు బాడీతో పాటు పేస్ కూడా డ్యాన్స్ చేస్తుంది. ఇది ఒక నటుడికి ఉండాల్సిన గొప్ప క్యాలిటీ అది. ఇది నా ఫేవరట్ సాంగ్.  అంజలి గారు పాటలో అందంగా కనిపిస్తుంది. పాటలన్నీ బావున్నాయి. దర్శకుడు,నిర్మాతలకు థాంక్స్.'' అన్నారు. 
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. జయంతో మొదలైన నితిన్ ప్రయాణం ఇరవై ఏళ్ళు పుర్తయింది. ఇది మామూలు విషయం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ హీరోలు వున్నారు. ఇంత కాంపిటేషన్ లో సక్సెస్ ఫుల్ గా వుండటం గొప్ప విషయం. నితిన్ మరిన్ని విజయాలతో ముందుకు వెళ్ళాలి. అంజలి మంచి నటి. ఇప్పుడు ఐటెం సాంగ్స్ తో మిమ్మల్ని అలరిస్తుంది. కృతిశెట్టి తో పాటు మిగతా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం దర్శకుడిగా పరిచయం అవుతున్న రాజ శేఖర్  కు ఆల్ ది బెస్ట్. సాగర్, నితిన్ కి భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ చిత్రం కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. పాటలన్నీ అద్భుతంగా వున్నాయి. ఆగస్ట్ 12న విడుదలౌతున్న ఈ చిత్రం మీ అందరికీ నచ్చాలి'' అని కోరుకున్నారు.