సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (15:06 IST)

పక్కింటి అమ్మాయిలా నా పాత్ర వుంటుంది- రామ్ ఎన‌ర్జిటిక్ హీరో - కృతి శెట్టి

Kriti Shetty
Kriti Shetty
ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్. విజిల్ మహాలక్ష్మి రోల్ చేశారు. సినిమా విడుదల సందర్భంగా కృతి శెట్టితో ఇంటర్వ్యూ.
 
ప్రశ్న: డిసెంబర్‌లో 'శ్యామ్ సింగ రాయ్', జనవరిలో 'బంగార్రాజు'... ఇప్పుడీ 'ది వారియర్'... మీ సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తోంది?
కృతి శెట్టి: 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' వెంట వెంటనే విడుదలయ్యాయి కదా! అందుకని, చాలా గ్యాప్ వచ్చినట్టు ఉంది.
 
ప్రశ్న: ఈ కథ విన్న తర్వాత ఏమనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి?
కృతి శెట్టి: లింగుస్వామి గారు తీసిన 'ఆవారా'ను చాలా ఏళ్ళ క్రితం తమిళంలో చూశా. ఆ సినిమా నాకొక జ్ఞాపకం. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సినిమా సీడీ తీసుకువెళ్లే దాన్ని. ఒక్కో రోజు రెండు మూడు సార్లు చూసిన సందర్భాలు ఉన్నాయి. లింగుస్వామి ఫోన్ చేశారని అమ్మ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే... ఆయన సినిమాలు ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటాయి. కథలు కొత్తగా ఉంటాయి. హీరోయిన్లకు పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న రోల్స్ ఉంటాయి. కథ విన్న తర్వాత ఇంకా ఎగ్జైట్ అయ్యాను. 
 
ప్రశ్న: 'బుల్లెట్...' సాంగ్ మాసివ్ హిట్ అయ్యింది. రీల్స్, యూట్యూబ్ షార్ట్స్... రీచ్ ఒక రేంజ్ ఉంది. షూటింగ్ చేసేటప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు?
కృతి శెట్టి: షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. రామ్ గారి ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. కానీ, ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. నేను కూడా ఎంజాయ్ చేస్తూ చేశా. 'బుల్లెట్...' సాంగ్ క్లాస్ అయితే 'విజిల్...' సాంగ్ మాస్. నాకు ఎక్స్ట్రా ఎనర్జీ కావాలని అనుకున్నప్పుడు విజిల్ సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తాను. కొంచెం స్టయిలిష్ అంటే 'బుల్లెట్...' సాంగ్. పాటలకు ముందు వచ్చే సీన్స్ చాలా బావుంటాయి.
 
ప్రశ్న: 'ది వారియర్' కథేంటి? అందులో మీ క్యారెక్టర్ ఏంటి?
కృతి శెట్టి: 'ది వారియర్'లో నా పాత్ర అందరూ ప్రేమించేలా ఉంటుంది. గాళ్ నెక్స్ట్ డోర్, క్యూట్ రోల్. కథ విన్న వెంటనే నేను కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నా. సినిమా చూసినప్పుడు మన ఇంట్లో అమ్మాయి లేదా పక్కింటి అమ్మాయి అనుకుంటారు. నా క్యారెక్టర్ పేరు విజిల్ మహాలక్ష్మి. ఆ అమ్మాయి ఆర్జే. 
 
ప్రశ్న: రామ్‌తో మీ కాంబినేషన్‌, మీ కాంబినేషన్‌లో సీన్స్ ఎలా ఉంటాయి?
కృతి శెట్టి: బుల్లెట్, విజిల్స్ సాంగ్స్ చూశారు కదా! అందరూ మా పెయిర్ బావుందని అంటున్నారు. సీన్స్ కూడా బావుంటాయి. థియేటర్లలో సినిమా వచ్చే వరకు వెయిట్ చేయండి. సీన్స్ గురించి ఇప్పుడే చెప్పలేను.    
 
ప్రశ్న: రామ్ పోలీస్ రోల్ చేశారు. మీది ఆర్జే రోల్. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది?
కృతి శెట్టి: పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్... మధ్యలోని రైల్వే స్టేషన్‌లో! బహుశా... అక్కడ ప్రేమ పుట్టి ఉండొచ్చు. 
 
ప్రశ్న: ఆర్జే రోల్ కోసం ఏమైనా హోమ్ వర్క్ చేశారా?
కృతి శెట్టి: తెలుగు ఆర్జే వీడియోస్ చాలా చూశా. వాయిస్ వినిపించినప్పుడు ఆర్జే కనిపించకపోయినా... ఎక్స్‌ప్రెష‌న్‌ ఫీల్ అవ్వాలి. అది గమనించాను. ఫారిన్ ఆర్జే వీడియోస్ చూశా. పాడ్ కాస్ట్ వీడియోస్ చూశా. 
 
ప్రశ్న: ఈ సినిమాకు ముందు రామ్ నటించిన సినిమాలు చూశారా?
కృతి శెట్టి: చూశా అండీ. 'ఇస్మార్ట్ శంకర్', 'రెడీ', 'హలో గురు ప్రేమ కోసమే' - ఇంకా చాలా సినిమాలు చూశా. నేను తెలుగు నేర్చుకోవాల్సిన సమయంలో తెలుగు సినిమాలు చాలా చూశా. 
 
ప్రశ్న: రామ్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ గురించి...
కృతి శెట్టి: ఆయన హై ఎనర్జీతో ఉంటారు. అందుకని, కొంచెం నెర్వస్ ఫీలయ్యా. కానీ, హీ ఈజ్ వెరీ కూల్.  
 
ప్రశ్న: దర్శకుడు లింగుస్వామి గురించి... 
కృతి శెట్టి: ఆయన ఏం కావాలో స్పష్టంగా తెలుసు. కొన్నిసార్లు ఎలా నటించాలో చేసి మరీ చూపిస్తారు. వాయిస్ మాడ్యులేషన్ కూడా చేశారు. 
 
ప్రశ్న: సినిమాలో ఇతర పాత్రల గురించి...
కృతి శెట్టి: ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ఆయనతో నా కాంబినేషన్ సీన్స్ లేవు. అయితే... ఒకరోజు సెట్స్‌కు వెళ్ళాను. బయట చాలా సాఫ్ట్‌గా ఉండే ఆయన... విలన్ రోల్‌లో కంప్లీట్ డిఫరెంట్‌గా అద్భుతంగా నటించారు. రామ్ తర్వాత ఎక్కువ సన్నివేశాలు నదియా గారితో చేశా. రాయల్‌గా ఉంటారు. 
 
ప్రశ్న: 'ది వారియర్'తో మీరు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మీకు ఇది తొలి తమిళ సినిమా! మీ ఫీలింగ్...  
కృతి శెట్టి: ఎగ్జైటెడ్ గా ఉన్నాను. 'ఉప్పెన' టైమ్ నుంచి కోలీవుడ్, తమిళ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అప్పుడు నేను ఊహించలేదు. అంత ప్రేమ చూపిస్తారని! ఇది బైలింగ్వల్ సినిమా, తమిళంలో కూడా షూట్ చేశాం. తమిళ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మరో తమిళ సినిమా చేస్తున్నారు. అందులో సూర్య గారు హీరో. నాగచైతన్య, వెంకట్ ప్రభు సినిమా చేస్తున్నా. అదీ తెలుగు - తమిళ్ బైలింగ్వల్. అందుకని, తమిళం నేర్చుకుంటున్నాను. 
 
ప్రశ్న: 'ది వారియర్', నాగచైతన్య - వెంకట్ ప్రభు సినిమా... శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ హౌస్‌లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్నారు. నిర్మాతల గురించి... 
కృతి శెట్టి: వెరీ నైస్ ప్రొడక్షన్ హౌస్. కాంప్రమైజ్ కాకుండా లావిష్, రిచ్ గా సినిమా తీశారు. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరికి సినిమా అంటే ప్రేమ. ఆయన తక్కువ మాట్లాడతారు. సినిమా ఖర్చు విషయంలో ఆ ప్రేమ చూపిస్తారు. 
 
ప్రశ్న: రెండు భాషల్లో షూటింగ్ చేయడం కష్టం అనిపించిందా?
కృతి శెట్టి: నా కంటే రామ్ ఎక్కువ కష్టపడ్డారు. నేను లిప్ సింక్, మ్యాచ్ చేయడం ఈజీ. రామ్ అలా కాదు... ప్రతి సీన్, డైలాగ్ విషయంలో ఆయన కష్టపడ్డారు. 
 
ప్రశ్న: కథల ఎంపికలో మీరు ఏం ఆలోచిస్తారు?
కృతి శెట్టి: కథ వినేటప్పుడు నేను ఎంట‌ర్‌టైన్‌ అయితే... ఆడియన్స్ కూడా ఎంట‌ర్‌టైన్‌ అవుతాని అనుకుంటాను. 
 
ప్రశ్న: చివరగా... ప్రేక్షకులు సినిమా చూసి ఎన్నిసార్లు విజిల్స్ వేస్తారని అనుకుంటున్నారు?
కృతి శెట్టి: ప్రేక్షకుల రియాక్షన్ చూసి నేను విజిల్స్ వేస్తా. అది మాత్రం పక్కా. 
 
ప్రశ్న: మీ డ్రీమ్ రోల్?
కృతి శెట్టి: ఇప్పుడు కాదు... కొన్నేళ్ల తర్వాత యాక్షన్ రోల్ చేయాలనుంది. ఫిమేల్ స్క్రిప్ట్స్ ఏవీ వినలేదు. 'ది వారియర్' తర్వాత 'మాచర్ల నియోజకవర్గం'తో ప్రేక్షకుల ముందుకు వస్తా.