యోగా డే వేడుకల్లో సైలెంట్ వారియర్స్
ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకోబడుతోంది. దేశంలోనూ యోగా డే వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమం యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా జమ్ముకాశ్మీర్ పూంఛ్‌లో భారత సైన్యం "సైలెంట్ వారియర్స్" చేరింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 సందర్భంగా, భారత సైన్యానికి చెందిన "సైలెంట్ వారియర్స్" పూంచ్ (జమ్మూ అండ్ కాశ్మీర్)లో యోగా సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సైలెంట్ వారియర్స్ ఏదైనా ఆకస్మిక పరిస్థితులకు ప్రతిస్పందించడానికి ఆపరేషనల్‌గా సిద్ధంగా ఉంటారు.
ఇకపోతే.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగా ఏ ఒక్కరికో చెందినది కాదని, అది అందరిదీ అని పేర్కొన్నారు.
యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడతాయన్నారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు.