సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (11:18 IST)

తెలంగాణాకు తాకిన అగ్నిపథ్ సెగ : సికింద్రాబాద్ స్టేషనులో రైలుకి నిప్పు-Video

secunderbad railway station
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుచొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు ఆందోళనలకు దిగారు. అగ్నిపథ్ విభాగం ద్వారా దేశానికి నాలుగుళ్ళపాటు సేవలు అందించేలా కేంద్రం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ నిరసన సెగలు అధికంగా ఉన్నాయి. ఇపుడు తెలంగాణాకు కూడా వ్యాపించాయి. 

 
అగ్నిపథ్‌ ను రద్దుచేసి మిలటరీ రిక్రూట్‌మెంటును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సికింద్రాబాద్‌లో యువకులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న బస్సులపై రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు.. రైల్వే స్టేషన్‌ వద్దనున్న బస్టాండుకు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.

 
దీంతో ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లారు. అక్కడ ఆగిఉన్న రైళ్లపై రాళ్లు రువ్వారు. రైలు పట్టాలపై పార్సిల్‌ సామాన్లు వేసి నిరసనకు దిగారు. రైలు పట్టాలకు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రయాణికులు భయంతో స్టేషన్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. అనుకోని ఈ ఘటనతో అధికారులు రైళ్లన్నింటినీ నిలిపివేశారు.