మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 జూన్ 2022 (15:48 IST)

రూ. 500 కోసం ఏటీఎం కార్డు పెడితే రూ. 2500 వస్తున్నాయ్, ఎగబడ్డ జనం

currency notes
ఓ ఏటీఎం కేంద్రంలో రూ. 500 కోసం బటన్ నొక్కి ఏటీఎం కార్డు పెడితే రూ. 2500 వస్తున్నాయి. అంటే... ఒక 500 నోటు కోసం ప్రెస్ చేస్తే ఐదు 500 నోట్లు వస్తున్నాయి. దీనితో జనం పెద్దఎత్తున ఆ ఏటీఎం కేంద్రం ముందు బారులు తీరారు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... నాగపూర్ జిల్లాలోని ఖాపర్ఖేడా టౌన్లో ఓ ప్రైవేట్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో ఓ వినియోగదారుడు రూ. 500 కోసం కార్డు పెట్టి నొక్కాడు. అంతే... 2500 వచ్చాయి. ఆశ్చర్యపోయి మళ్లీ కార్డు పెట్టాడు. మళ్లీ అదేతంతు. ఐతే అతడు ఖాతాలో కేవలం 500 డెబిట్ అయినట్లు వస్తుంది కానీ చేతికి 2500 వచ్చాయి. ఇంకేముంది జనం తండోపతండాలుగా ఆ కేంద్రానికి క్యూ కట్టారు. దీనితో విషయం కాస్తా పోలీసులకు చేరడంతో వెంటనే బ్యాంకు సిబ్బంది రంగంలోకి దిగింది.

 
100 ట్రేలో పొరపాటును 500 కాగితాలను పెట్టడంతో ఇలా జరిగిందని తేల్చారు. ఆ తర్వాత ఎంతమంది వినియోగదారులు ఆ టైంలో క్యాష్ విత్ డ్రా చేసారన్నది తెలుసుకుని ఎక్కువమొత్తం విత్ డ్రా చేసినదాన్ని తిరిగి రాబట్టే పనిలో వున్నారు.