శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (14:00 IST)

మాస్ట్రో ఇళయరాజాతో మ్యూజిక్ సిట్టింగ్స్ గొప్ప అనుభూతి - కృష్ణవంశీ

Ilayaraja, Krishnavanshi
Ilayaraja, Krishnavanshi
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం రంగమార్తాండ. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ప్రస్తుతం దర్శకుడు కృష్ణవంశీ సంగీత దర్శకుడు ఇళయరాజా తో నేపధ్య సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.  ఫస్ట్ టైమ్ కృష్ణవంశీ మ్యూజిక్ సిట్టింగ్స్ వీడియోస్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇళయరాజాతో వర్క్ ఎక్స్ప్రీరియన్స్ ను షేర్ చేశారు. ఇదో గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు.
 
త్వరలో ఫస్ట్ లుక్ విడుదల కాబోతున్న రంగమార్తాండ సినిమాలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అలీ రేజా తదితరులు నటించారు. త్వరలో ఈ సినిమాకు సంభందించిన మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ తెలుపనుంది.