సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (15:45 IST)

రామ్ న‌టించిన ది వారియర్‌లో రెండో పాట ఆవిష్క‌రించిన గౌతమ్ మీనన్

Ram, Kriti Shetty
Ram, Kriti Shetty
సత్య ఐపీఎస్ పాత్రలో యువ కథానాయకుడు ఉస్తాద్ రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి... వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమా 'ది వారియర్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. జూలై 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రెండో పాట 'దడ దడ...'ను  ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ ఈ రోజు విడుదల చేశారు.  
'దడదడమని హృదయం శబ్దం... 
నువ్వు ఇటుగా వస్తావని అర్థం!
బడబడమని వెన్నెల వర్షం...
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం!
నువ్వు విసిరిన విజిల్ పిలుపు ఒక గజల్ కవితగా మారే... 
చెవినది పడి కవినయ్యానే     
తెలియదు కదా పిరమిడులను పడగొట్టే దారే...
నీ ఊహల పిరమిడ్ నేనే'
 
అంటూ సాగిన ఈ గీతానికి రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ శ్రావ్యమైన మెలోడీ బాణీ సమకూర్చగా... శ్రీమణి సాహిత్యం అందించారు. హరిచరణ్ పాటను ఆలపించారు. 
  
నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "పాటను విడుదల చేసిన గౌతమ్ మీనన్ గారికి థాంక్స్. కొన్ని క్షణాల్లో సాంగ్ వైరల్ అయ్యింది. హైదరాబాద్‌లోని అందమైన లొకేషన్స్‌లో పాటను చిత్రీకరించాం. అందరూ హమ్ చేసే విధంగా రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ మంచి మెలోడీ అందించారు. ఆల్రెడీ విడుదలైన 'బుల్లెట్...' సాంగ్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ లభిస్తోంది. సినిమాలో పాటలన్నీ వేటికవే వైవిధ్యంగా ఉంటాయి. ఇటీవల ;షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తాం'' అని చెప్పారు.
 
రామ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై. సత్యనారాయణ, యాక్షన్: విజయ్ మాస్టర్ & అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా - లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్, స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌, నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శ‌క‌త్వం: ఎన్‌. లింగుస్వామి.