1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Hero Satya No More

టాలీవుడ్‌లో విషాదం: హీరో సత్య కన్నుమూత

Sathya
Sathya
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు హీరో మరణించారు. ఎన్నో సంవత్సరాల క్రితమే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఆరంభంలో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆ తర్వాత హీరోగా నటించిన సత్య కన్నుమూశారు. 
 
ప్రస్తుతం సినిమాలు చేయకుండా సొంత వ్యవహారాలు చూసుకునే ఆయన గురువారం సాయంత్రం గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక ఆయనకి గుండె పోటు రావడంతో వెంటనే వైద్యుల్ని సంప్రదించక అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
2004వ సంవత్సరంలో వచ్చిన వరం సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు ఆ తర్వాత బ్యాచులర్స్ అనే చిత్రాల్లో కూడా నటించారు. అంతగా కలిసి రాకపోవడంతో ఇక సినిమాలకు దూరంగా ఉన్నారు.
 
ఈ క్రమంలోనే సత్య కొన్ని వ్యాపారాలను చేశారు. కరోనా సెకండ్ సమయంలో తన భార్యను తల్లిని కోల్పోయారు. అప్పటి నుంచి ఆయన మానసిక క్షోభకు లోనైనట్లు కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. 
 
ప్రస్తుతం ఈ హీరోకి ఎనిమిది సంవత్సరాల వయసున్న కుమార్తె ఉంది. ఆయన మరణవార్త వినగానే టాలీవుడ్ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి ఆయన సన్నిహితులు పలువురు సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలియజేస్తున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
గానగంధర్వుడు ఎస్పీబీ 75వ జయంతి.. అదొక స్వర్ణయుగం అన్న బాబు