KGF రాఖీభాయ్‌లా సిగరెట్లు కాల్చుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు
సినిమాలను చూసి కొంతమంది వాటిని అనుకరించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఇలాంటి ఘటనే హైదరాబాదులో జరిగింది. 15 ఏళ్ల విద్యార్థి KGF హీరో రాకీ భాయ్‌గా మారడానికి ప్రయత్నించాడు. ఆ హీరోను అనుకరిస్తూ పెట్టెలకొద్దీ సిగరెట్లు తాగాడు. దీనితో ఆసుపత్రిపాలయ్యాడు.
సిగరెట్లు తాగిన తర్వాత విద్యార్థికి గొంతులో విపరీతమైన నొప్పి వచ్చింది. ఆ తర్వాత వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. విపరీతంగా సిగరెట్లు తాగడంతో పొగవల్ల విద్యార్థికి గొంతు నొప్పి వచ్చిందని వైద్యుడు తెలిపాడు.
KGF సినిమాలోని రాకీ భాయ్ స్ఫూర్తితో ఇదంతా చేశానని, 2 రోజుల్లో బాక్స్ సిగరెట్ తాగానని విద్యార్థి చెప్పాడు. సినిమాల్లో హీరోలు ఏదో ఫీట్లు చేస్తున్నారని వాటిని అనుకరిస్తే ఇలాగే అవుతుందనీ, సినిమాను సినిమాగానే చూడాలని వైద్యుడు చెప్పారు.