గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మే 2022 (14:39 IST)

శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు - రేపు అమ్మఒడి మూడో విడత నిధులు

ysjagan
ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు నిధుల పంపిణీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం అంటోంది. ఇందులోభాగంగానే అమ్మఒడి మూడో విడత నిధులను బుధవారం జమ చేయాలని భావిస్తుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ నిధులను జమ చేయనున్నారు. 
 
అంటే 2021 సంవత్సరంలో అక్టోబరు - డిసెంబరు నెలకు సంబంధించి జగనన్న విద్యా దీవెన పథకం కింద ఈ ఆర్థిక సాయం చేయనుంది. ఈ సారి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. దీంతో ఒకేసారి రూ.709 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 
 
ఈ విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని విద్యార్థుల తల్లులకు అందజేయనున్నారు.