శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (10:54 IST)

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కేటీఆర్ పర్యటన

ktrao
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. దేవరకద్ర, కొడంగల్‌ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 
 
దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్‌ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్‌ (సిద్దాయపల్లి) వద్ద నిర్మించిన 288 డబుల్‌ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తారు. 
 
భూత్పూర్‌లో మినీ స్టేడియం నిర్మాణానికి, సమీకృత వెజ్‌-నాన్‌ వెజ్‌ మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. 
 
వర్నే-ముత్యాలపల్లి రోడ్డుపై బ్రిడ్జి, గుడిబండకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. భూత్పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.