ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (09:08 IST)

నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న మంత్రి హరీష్ రావు

harish rao
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి, తెరాస సీనియర్ నేత టి.హరీష్ రావు నడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం అలిపిరి మొదటి మెట్టువద్ద మంత్రి హరీష్ రావు కొబ్బరికాయ కొట్టి తన నడకను ప్రారంభించారు. 
 
ఆయన శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడక ద్వారా తిరుమలకు చేరుకున్న హరీష్ రావుకు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద తితిదే అధికారులు పుష్పగుచ్ఛ ఇచ్చి స్వాగతం పలికారు. మంత్రి హరీష్  రావు పుట్టిన రోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చారు. 
 
మరోవైపు, మంత్రి హరీష్ రావు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. శుక్రవారం హెల్పింగ్ ఛాలెంజ్‌ను ప్రారంభిచనున్నారు. ఇందులో భాగంగా, తెరాస కార్యకర్తలు కష్టాల్లో ఉన్న ఎవరికైనా సాయం చేయాల్సివుంటుంది. ఆ తర్వాత సహాయం చేసినవారితో సెల్ఫీ దిగి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయాల్సివుంటుంది. ఇదే విధంగా మరికొందరికి సాయం చేయాలని ఛాలెంజ్ చేయాల్సివుంటుంది.