సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 మే 2022 (12:15 IST)

నారా లోకేష్ పాదయాత్ర.. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం

Lokesh-Babu
Lokesh-Babu
Lokesh-Babu
తెలుగుదేశం పార్టీ అధినేత, తన తండ్రి చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టిన పదేళ్ల తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 2వ తేదీన గాంధీజయంతి నాడు నారా లోకేష్ ఈ పాదయాత్రను ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. 
 
గతంలో చంద్రబాబు కూడా ఇదే తేదీన పాదయాత్రను ప్రారంభించారు. ఒకవేళ ముందస్తు ఎన్నికల సంకేతాలు ఉంటే... పాదయాత్ర ప్రారంభ తేదీ మరింత ముందుకు జరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం.
 
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపడమే లక్ష్యంగా నారా లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది.