బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మే 2022 (09:28 IST)

నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు... కొత్త పద్ధతి అమలు.. రాజీనామా చేస్తారా?

nara lokesh
తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
పార్టీ సంస్థాగత మార్పులపై ఒక విధంగా షాక్‌కు గురిచేసే ప్రతిపాదనలు చేశారు నారా లోకేష్. పార్టీ పదవుల విషయంలో కొత్త పద్ధతికి తెరలేపారు. పార్టీని బలోపేతం చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు. 
 
పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానాన్ని రద్దు చేయాలని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ విధానాన్ని తన నుంచే అమలు చేయాలని భావిస్తున్నానంటూ కామెంట్స్ చేశారు. 
 
ఇంకా నారా లోకేష్ మాట్లాడుతూ.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు చేశానని.., ఈ సారి తాను తప్పుకుని వేరొకరికి అవకాశం కల్పిస్తాని లోకేష్ చెప్పారు. అలాగే వరుసగా రెండుసార్లు ఒకే పదవిలో ఉన్నవారికి బ్రేక్ ఇవ్వాలన్నారు.
 
అలాగే వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నేతలకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని.. ఆయా నియోజకవర్గాల్లో కొత్తవారికి, కష్టపడి పనిచేసేవారికి అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు నారాలోకేష్ తెలిపారు. లోకేష్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. 
 
స్వయంగా పార్టీ పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నేతలకు ఎన్నికల్లో ఛాన్స్ ఇచ్చేది లేదని చెప్పడంతో కొందరు సీనియర్ నేతలకు షాక్ ఇవ్వనున్నట్లు అర్ధమవుతోంది.