శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 మే 2022 (19:37 IST)

నారా లోకేశ్‌పై మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్

టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్‌పై ఏపీ వ్య‌వ‌సాయ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతు, కౌలు రైతుకు మ‌ధ్య తేడా ఏమిటో లోకేశ్‌కు తెలుసా? అంటూ మంత్రి కాకాణి మండిపడ్డారు. 

వ్య‌వ‌సాయం గురించి ఏమాత్రం తెలియ‌ని వాళ్లు కూడా సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నార‌ని దెప్పి పొడిచారు. లోకేశ్ ఏమైనా హ‌రితవిప్ల‌వ పితామ‌హుడా? లేక వ్య‌వ‌సాయ రంగ నిపుణుడా? అంటూ నిల‌దీశారు. 
 
మాజీ ముఖ్య‌మంత్రి కుమారుడు అయినంత మాత్రాన లోకేశ్ ఏదిప‌డితే అది మాట్లాడ‌ట‌మేనా? అంటూ ఫైర్ అయ్యారు. అస‌ని తుఫాను కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌కు క‌చ్చితంగా న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు.