శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మే 2022 (12:08 IST)

నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన

తన నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి మూడో రోజుల పాటు పర్యటించనున్నారు. బాబు పర్యటన కోసం చిత్తూరు జిల్లా టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిత్తూరు చేరుకుంటారు. 
 
ఈ సందర్భంగా కుప్పంలో జరిగే 'బాదుడే బాదుడు' ప్రచారంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు ఎండగడతారు. మరోవైపు అమరావతి అంతర్గత రింగ్ రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ అధికారులు చంద్రబాబు నాయుడుకు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీచేసే అవకాశం ఉంది.