మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-05-22 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినాయ...

astro3
మేషం :- మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురికాకండి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 
వృషభం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో సఫలీకృతులౌతారు. నిత్యావసర వస్తుస్టాకిస్టులు, వ్యాపారులకు కలిసిరాగలదు. ద్విచక్ర వాహనం పై దూరప్రయాణాలు మంచిది కాదు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తత అవసరం. ఆలయాలను సందర్శిస్తారు.
 
మిథునం :- సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. స్త్రీలు గృహోపకరణాలకు విలువైన వస్తువులను కొనుగోలుకై చేయుయత్నాలు వాయిదా పడతాయి. చేతి వృత్తి, వ్యాపారులకు సదావకాశాలు లభిస్తాయి. వస్త్ర, ఆకస్మిక ధనలాభం వంటి శుభపరిణామాలున్నాయి.
 
కర్కాటకం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. దైవ, సేవా, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిత్తశుద్ధితో మెలిగి మీ నిజాయితీని చాటుకుంటారు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. పెంపుడు జంతువుల పట్ల మెళకువ వహించండి.
 
సింహం :- ప్రింటింగ్ రంగాల వారికి పని భారం బాగా పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు ఒక కొలిక్కి రాగలవు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కన్య :- వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు వాయిదా పడటం మంచిది. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. సోదరి, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి వంటివి తప్పవు. గృహంలో మార్పులు, చేర్పులు త్వరలో అనుకూలిస్తాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
తుల :- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు స్థానమార్పిడికై చేయు ప్రయత్నాలలో కొంత అసంతృప్తికి గురవుతారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఓర్పు, లౌక్యం చాలా ముఖ్యం. విద్యార్థులు తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన. పెద్దల, దైవ కార్యాలలో పాల్గొంటారు. ప్రైవేటు సంస్థలలో వారికి తోటివారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. స్త్రీలకు రచనలు, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. పాత రుణాలు తీరుస్తారు.
 
ధనస్సు :- కుటుంబీకులతో కలిసి ఆలయాలను, ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు అనుకూలిస్తాయి. విద్యార్థులు ఇతరుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. కోర్టు పనులు వాయిదా పడటం మంచిదని గమనించండి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
మకరం :- ఆర్థిక సమస్యల నుంచి విముక్తులవుతారు. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు సదావకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. దూర ప్రయాణాల్లో చికాకులు, అసహనానికి గురవుతారు.
 
కుంభం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. స్థిరచరాస్తుల విషయంలో ముఖ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. కిరాణా, ధాన్యం వ్యాపారులకు, స్టాకిస్టులకు మెలకువ అవసరం. ఖర్చులు సామాన్యంగా ఉండగలవు. ప్రియతముల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. సభ, సమావేశాలలో పాల్గొంటారు.
 
మీనం :- ఆదాయానికి మించి ఖర్చులు అధికమవ్వడం వల్ల ఆందోళన చెందుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి అనుకున్నంత గుర్తింపు లభించదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.