శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By రామన్

10-05-22 మంగళవారం రాశిఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు ...

astro2
మేషం :- ఆదాయానికి తగినట్లుగా ఖర్చు చేస్తారు. మీ సంతానం ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ మాటకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది.
 
వృషభం :- ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బంధువుల నుంచి విబేధాలు తలెత్తుతాయి. ప్రముఖుల కలయికతో పనులు సానుకూలమవుతాయి. మిత్రుల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు.
 
మిథునం :- ఆర్థికంగా వెనుకబడతారు. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది.
 
కర్కాటకం :- పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల మానసికంగా కుదుటపడతారు. తలపెట్టిన పనులు వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు జాగ్రత్త అవసరం. హామీలు, చెక్కుల విషయంలో మెళుకువ అవసరం. బంధు మిత్రులలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. రవాణా రంగాల వారికి ఇబ్బందులు తప్పవు.
 
సింహం :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. మార్కెటింగ్, ప్రైవేటు సంస్థలలోని వారు అధిక శ్రమ, ఒత్తిడికి గురవుతారు. దైవ సేవా కార్యక్రమాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు చుట్టుపక్కల వారిలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
కన్య :- కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. నూతన వ్యాపారయత్నాలు అనుకూలించవు. ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. క్రీడా, కళా, సాంస్కృతిక రంగాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. విద్యార్థినులు తోటివారి కారణంగా మాటపడవలసి వస్తుంది.
 
తుల :- ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారస్తులకు సామాన్యం. మీ సంతానం ఆరోగ్య విషయంలో మెలకువ చాలా అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు మరి కొంతకాలం వాయిదా వేయటం మంచిది. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ మొండి ధైర్యం, పట్టుదల మిమ్ములను కార్యోనుముఖులను చేస్తాయి.
 
వృశ్చికం :- ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. దేవాలయ విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
ధనస్సు :- ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటింబీకుల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. స్త్రీలకు ఇరుగు పొరుగువారిని నుంచి గుర్తింపు లభిస్తుంది.
 
మకరం :- ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వెళ్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. ఉద్యోగస్తులు సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. మిత్రుల రాక మీకు ఆనందాన్నిస్తుంది. గృహంలో మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం.
 
కుంభం :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. లీజు, ఏజెన్సీలు నూతన టెండర్ల విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. బంధువులను కలుసుకుంటారు.
 
మీనం :- రావలసిన ధనం వసూలులో జాప్యం, ప్రయాసలెదుర్కుంటారు. భాగస్వామిక ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోకుండా కొన్ని పనులు పూర్తి చేస్తారు.