గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-05-2022 సోమవారం రాశిఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన...

astro10
మేషం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి.
 
వృషభం :- కుటుంబీకులతో సున్నితంగా మెలగడం మంచిది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలయందు లాభసాటిగా నడుస్తాయి.
 
మిథునం :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. దైవ పుణ్యక్షేత్రములు దర్శనము చేయుటవలన మనశ్శాంతి కలుగును. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
కర్కాటకం :- దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఆలయాలను సందర్శిస్తారు.
 
సింహం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. గతంలో వచ్చిన ఖర్చులు కొంత తగ్గుముఖము పట్టవచ్చు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కన్య :- ట్రాన్సుపోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రుణదాతల ఒత్తిడి అధికంగా ఉన్నా మిత్రుల సహకారంతో సమసిపోగలవు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.
 
తుల :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. డాక్టర్లకు శస్త్రచికిత్సలు చేయునపుడు జాగ్రత్త అవసరం. మీ లోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. గత అనుభవాలు ముచ్చటిస్తారు.
 
వృశ్చికం :- స్త్రీలకు పనిభారం అధికం. దూరపు బంధువుల నుంచి కావలసిన సమాచారం అందుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. కొంతమంది మీ ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నిస్తారు. కాంట్రాక్టులకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
ధనస్సు :- కంప్యూటర్, ఇన్వర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి కలిసివచ్చేకాలం. స్త్రీలు మోకాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పధకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. రిప్రజెంటేటివ్‌లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతుంది.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు, కీలమైన వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. రాజకీయ నాయకులు పార్టీ సభ్యులతో ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన స్ఫురిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. 
 
కుంభం :- స్త్రీలకు రచనలు, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తుల శ్రమకు తగిన ప్రతిఫలం, ప్రోత్సాహం లభిస్తాయి. తల పెట్టిన పనిలో కొంతముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయటం వల్ల సత్ఫలితాలు పొందుతారు.
 
మీనం :- మీ కళత్ర వైఖరి అసహనానికి గురిచేస్తుంది. మీ సంతానం భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఆర్థిక వ్యవహారాల్లో స్వల్ప ఒడిదుడుకులెదుర్కుంటారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.