ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 4 మే 2022 (09:43 IST)

04-05-22 బుధవారం రాశిఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం..

astro10
మేషం :- ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. కుటుంబీకుల కోసం నూతన పథకాలు రూపొందిస్తారు. నూతన ప్రదేశ సందర్శనల వల్ల నూతన ఉత్సాహం కానరాగలదు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ శాఖాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు. వాహనచోదకులకు ఏకాగ్రత ప్రధానం.
 
వృషభం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. క్రయవిక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. బృంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
మిథునం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహకరం. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి సంతృప్తి, పురోభివృద్ధి. 
 
కర్కాటకం :- ఒక వ్యవహారమై న్యాయసలహా స్వీకరిస్తారు. తల పెట్టిన పనులు అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. ఉత్తరప్రత్యుత్తరాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. గృహ మర్మతులు, నిర్మాణాలు చేపడతారు.
 
సింహం :- వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. పెద్దల ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. స్త్రీలకు వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. క్రీడా రంగాల్లో వారికి శుభదాయకం. ధనవ్యయం అధికంగా ఉన్నా సార్థకత ఉంటుంది. దూరప్రయాణాలలో చికాకు తప్పదు.
 
కన్య :- పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు ఆశించినంత పురోభివృద్ధి. దైవకార్యాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఖర్చులు అదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు. ఆపత్సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం.
 
తుల :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉండగలదు. ఆడిటర్లకు పనిభారం పెరుగుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. కుటుంబ సౌఖ్యం కొంత తగ్గుతుందనే చెప్పవచ్చు. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. స్త్రీలు విలువైన వస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు.
 
వృశ్చికం :- విద్యా సంస్థల వారికి ఆందోళన తప్పదు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. చేతి వృత్తుల వారికి కలిసివస్తుంది. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. ప్రయాణాలు, తీర్థయాత్రలలో అసౌకర్యానికి గురవుతారు.
 
ధనస్సు :- కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు పురోభివృద్ధి. మీ అలవాట్లు, బలహీనతలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమాధిక్యత అధికమవుతాయి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ధనసహాయం, హామీలకు దూరంగా ఉండటం మంచిది. సాహస ప్రయత్నాలు విరమించడం మంచిది.
 
మకరం :- రచయితలకు, కళాకారులకు సదావకాశాలు లభిస్తాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుండి అన్ని విధాలా సహకారం, ప్రోత్సాహంలభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పోటీ ఎదుర్కొంటారు. విద్యుత్, ఎ.సి., కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి. 
 
కుంభం :- ఆర్ధిక ఇబ్బందీ అంటూ ఏదీ ఉండదు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రుణాలు తీరుస్తారు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
మీనం :- ఉద్యోగస్తుల ఓర్పు, నేర్పులకిది పరీక్షా సమయమని గమనించండి. స్త్రీలకు చుట్టుపక్కల వారిలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. మీ వ్యక్తిగత భావాలను బయటికి వ్యక్తం చేయకండి. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. రావలసిన ఆదాయం అందటంతో ఆర్థికంగా ఒకడుగు ముందుకేస్తారు.