1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. JC Prabhakar Reddy into Police Custody

టీడీపీ వర్సెస్ టీడీపీ - పుట్టపర్తిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు

jc prabhakar reddy
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని పుట్టపర్తి పోలీసులు అరెస్టు చేశారు. తెదేపాకు చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, అదే పార్టీకి చెందిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య జరిగిన వివాదంతో పుట్టిపర్తిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో పరిస్థితి చక్కబడింది. 
 
తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి తన నియోజకవర్గమైన పుట్టిపర్తిలోకి తన అనుమతి లేకుండా ఎలా వస్తారంటూ రఘునాథ రెడ్డి చాలా కాలం నుంచే వ్యతిరేకతతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సత్యసాయి జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి పుట్టపర్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగి, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
తర్వాతి కథనం
May 27 కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు