మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 30 మే 2022 (17:45 IST)

చెత్తపన్ను, విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్ను.. బాదుడే బాదుడు: నారా లోకేష్ పాదయాత్ర ప్లాన్?

మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందనీ, అనుకున్నదానికంటే ప్రజలు మూడింతలు వచ్చారంటూ తెదేపా నాయకులు ఖుషీగా వున్నారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వుందనీ, ప్రజల నడ్డి విరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆగ్రహంతో వున్నారని తెదేపా నాయకులు చెపుతున్నారు.

 
ఇకపోతే... ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతూ వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లోకి వెళ్లాలని నారా లోకేష్ భావిస్తున్నారట. చెత్తపన్ను, విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్ను ఇబ్బడిముబ్బడిగా పెంచేసి ప్రజల నడ్డి విరుస్తున్నారనీ, ఇంకా వీటితో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి వద్దకు వెళ్లాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు చెపుతున్నారు.

 
ఐతే గతంలో నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి పీఠం దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ సైతం పాదయాత్ర చేసి ప్రజల మధ్య తిరిగారు. ఆ యాత్రతో ఆయన సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. మరి నారా లోకేష్ నిజంగానే పాదయాత్ర చేస్తారా... లేదంటే ఓ వార్తగానే మిగిలిపోతుందా చూడాల్సి వుంది.