ఏపీ ప్రజలకు మరోమారు షాకిచ్చిన సీఎం జగన్ సర్కారు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు షాకిచ్చింది. పట్టణాల్లో ఆస్తి పన్నును భారీగా పెంచేసింది. ఈ భారం దాదాపుగా రూ.214 కోట్ల మేరకు ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రంలో భారీగా విద్యుత్ చార్జీలను పెంచేశారు. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై మరో పిడుగు వేసింది. ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచింది. పట్ణాల్లో భారీగా ఆస్తి పన్నును పెంచింది. ఈ పెంపు భారం పట్టణాల్లో 15 శాతం మేరకు ఉంది. గత రెండు సంవత్సరాల్లో ఈ పెంపు భారం 32.4 శాతంగా ఉంది.
కాగా, కరెంట్ బిల్లులు చెల్లించకుంటే ఫీజులు తీసుకెళ్లడం, ఆస్తి పన్ను చెల్లించకుంటా ఆస్తులు జప్తు చేయడం వంటి చర్యలు ఏపీలో పరిపాటిగా మారిపోయాయి. కానీ, ప్రభుత్వం మాత్రం ఆస్తి, చెత్త పన్నులతో పాటు కరెంట్ చార్జీల బాదుడుతో అష్టకష్టాలు పెడుతుంది.