గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (14:38 IST)

ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

andhrapradesh logo
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో నేపథ్యంలో ఈ అధికారులను బదిలీ చేసింది. కొత్త జిల్లాలకు పాలనాపరమైన సౌలభ్యం కోసం కొత్తగా కలెక్టర్లను నియమించింది. 
 
ఇందులోభాగంగా, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌గా అనుపమ అంజలి, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనరుగా కె.దినేష్ కుమార్‌లను నియమించింది. 
 
అదేవిధంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టరుగా పని చేస్తూ వచ్చిన టి.నిషాంతిని అక్కడ నుంచి బదిలీ చేసి సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. 
 
ప్రకాశం జిల్లా సచివాలయాల విభాగం జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్‌ను బదిలీ చేసి సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టరుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు.