సిద్ధమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త జట్టు
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరికొత్త జట్టు సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీన ఈ కొత్త జట్టు కోసం ఎంపికైన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో గవర్నర్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కొత్త జట్టును పాత, కొత్త కలయికతో తన టీమ్ ఎంపిక చేసుకున్నారు. పాతవారిలో 10 మందికి మళ్లీ మంత్రులుగా అవకాశం కల్పించారు. కొత్తగా 15 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు.
కొత్త మంత్రుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత దక్కబోతుంది. బలహీనవర్గాలకు పెద్ద పీట వేసి వారిని రాజ్యాధికారంలో మరిత కీలక భాగస్వాములను చేయాలనే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అందులోభాగంగానే 56 శాతం మంత్రిపోస్టులను వారికే కేటాయించినట్టు తెలుస్తుంది.
అదేసమయంలో ఇప్పటివరకు మంత్రివర్గంలో ఉన్న 10 మంది వరకు ఆయా జిల్లాల అవసరాలు, సామాజిక మార్పు, అనుభవం ఆధారంగా ఇకపైనా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఇప్పటివరకు అగ్రవర్ణాలకు చెందిన 44 శాతం మంది ఉండగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే మెజార్టీ సంఖ్యలో 56 శాతంగా ఉందన్నారు.