నేటి నుంచి తిరుమల కొండపై ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఓ మంచి నిర్ణయం తీసుకుంది. పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని కొండపై పూర్తిగా నిషేధించింది. ఈ నిషేధం బుధవారం నుంచి అమల్లోకిరానుంది. ఇదే అంశంపై భక్తులకు కూడా తితిదే ఓ విన్నపం చేసింది.
నేటి నుంచి తిరుమలపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్‌కు పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొంది. ఈ నిషేధం బుధవారం నుంచి కఠినంగా అమలు చేయనున్నట్టు పేర్కొంది.
మరోవైపు, కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించబోమని ప్రకటించిన తితిదే అందుకు తగినట్టుగానే నిఘా పెట్టింది. అలిపిరి టోల్ గేట్ వద్ద ప్లాస్టిక్‌ను గుర్తించే సెన్సార్లతో నిఘా పెంచనున్నట్టు తెలిపింది. అలాగే కొండపై వ్యాపారాలు చేసేవారు కూడా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన చేసింది.