శనివారం, 12 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్

శ్రీవారికి రికార్డు ఆదాయం - రూ.5.43 కోట్ల కానుకలు

venkateswara swamy
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు రికార్డు స్థాయిలో కానుకలు సమర్పించారు. కరోనా మహమ్మారి తర్వాత ఇంత భారీ స్థాయిలో కానుకలు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
మంగళవారం వారం నుంచి అర్థరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. ఇందులో ఏకంగా 5.43 కోట్ల రూపాయలు లభించినట్టు తితిదే అధికారులు వెల్లడించారు. కరోనా తర్వాత అత్యధికంగా లభించిన హుండీ ఆదాయం ఇదేనని తితిదే అధికారులు అధికారికంగా ప్రకటించారు.