1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra Pradesh Weather Report

Weather: వేసవి కాలం రాకముందే భానుడు భగభగ.. ఏపీలో ఎండలే ఎండలు

summer
వేసవి కాలం రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మార్చి నెలలోనే ఎండలు, ఉక్కపోత తీవ్రంగా ఉండనున్నాయి. 
 
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నాటికే రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. 
 
అనంతపురంలో అత్యధికంగా 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నరసాపురం, మచిలీపట్నం, కావలి వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 
 
ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ మార్చి తొలి రోజుల్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. 
తర్వాతి కథనం
మదనపల్లెలో రూ.90 నుండి రూ.140కి పడిపోయిన టమోటా ధరలు